త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసిన రాజమౌళి!

RRR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రాణం పోసిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఫస్ట్ లుక్ లను చూసిన ప్రేక్షకులలో భారీ అంచనాలే మొదలయ్యాయి. ఇక ఈ చిత్ర బృందం ప్రమోషన్లు పూర్తి చేసుకొని ఈ సంక్రాంతి బరిలోకి దించాల్సిన సమయంలో వాయిదా గేట్ వేశారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదలను రాజమౌళి పోస్టుపోన్ చేసాడు.

RRR
RRR

ఆ మధ్య రాజమౌళి ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ మెగా, నందమూరి అభిమానులను కంట తడి పెట్టించిందనే చెప్పొచ్చు. ఇక తాజాగా రాజమౌళి ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ ను ఆనంద పరిచే విధంగా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో వెలగనున్న ఈ సినిమాను కరోనా పరిస్థితులను బట్టి ప్రేక్షకుల ముందు ఉంచేలా రాజమౌళి ప్లాన్ చేసాడు.

మార్చి 18 వ తేదీన గానీ, ఏప్రిల్ 28 న గానీ ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసాడు. కరోనా పరిస్థితులు చక్కబడి థియేటర్లు ఓపెన్ అయితే మార్చి18న విడుదల చేస్తామని.. ఒకవేళ అలా జరగకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ సినిమాను ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ చేస్తామని రాజమౌళి తెలిపాడు. ఈ విషయాన్ని మెగా, నందమూరి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ గా భావిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *