పిల్లల గురించి ఎదురు చూస్తున్నానంటున్న ప్రియాంక చోప్రా!

Priyanka Chopra: బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన ప్రియాంక చోప్రా గురించి మనందరికీ తెలుసు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందానికి ఫ్యాన్స్ పిచ్చెక్కి ఫిదా అవ్వాల్సిందే. ఈ అందాల భామ హాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ ఈ మధ్య బిజీగా ఉంటుంది.

Priyanka Chopra
Priyanka Chopra

ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇక 2018లో పాప్ సింగర్ నిక్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఎప్పటికప్పుడు ఈ జంట కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టా లో అప్డేట్ చేస్తూ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తూ ఉంటారు. కాగా మ్యారేజ్ అయిన మూడు ఏళ్ళు సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి మాట్లాడింది ప్రియాంక.

ఒక హాలీవుడ్ పోర్టల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. భవిష్యత్తులో అమ్మ కావడానికి ఎదురుచూస్తున్నానని, అది కలిగినప్పుడు తమ జీవితాల్లో జరిగే మార్పులను ఎంజాయ్ చేయడానికి తన భర్త పాప్ సింగర్ నిక్ తో పాటు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పిల్లలు జీవితంలో ఒక భాగం మాత్రమే కాదని, అంతకు మించి వారికి ప్రాముఖ్యత ఉందని తెలిపింది.

అంతేకాకుండా వారిద్దరూ చాలా పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా అని అడగగా.. వారిద్దరూ అంత బిజీగా ఏం లెమని బోల్డ్ గా తేల్చి చెప్పింది ఈ భామ. ప్రస్తుతం ప్రియాంక చోప్రా పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *