‘సలార్’ సినిమాలో శృతిహాసన్ రోల్ అనౌన్స్మెంట్ చేసిన డైరెక్టర్!

Shruthi Haasan: టాలీవుడ్ ప్రేక్షకులకు శృతి హాసన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది.

ఈ భామ సోషల్ మీడియా లో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే జనవరి 28న ఈ బ్యూటీ బోర్న్ డే సందర్భంగా ‘సలార్ ‘ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ శృతీ కు విష్ చేసి సర్ ప్రైజింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రానికి డైరెక్టర్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మెప్పించబోతుంది. తాజాగా నీల్ ఈ చిత్రంలో శృతి క్యారెక్టర్ రివీల్ చేశాడు. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆధ్య పాత్రలో శృతి నటిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్ర నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఇక అంతే కాకుండా కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *