సర్కారు వారి పాట: కళావతి సాంగ్ @ 150 మిలియన్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేగాక ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ వీడియో అండ్ సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.

Mahesh babu kalaavathi song create new records

ఇక ఈ సినిమా.. విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘కళావతి’ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యంత వేగంగా 100మిలియన్‌ వీక్షణలతో అరుదైన ఘనత సాధించిన ఈ పాట తాజాగా 150 మిలియన్‌ వ్యూస్‌తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకొంది. విడుదలైన నాటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లు ఉన్న ఈ ‘కళావతి’ ఈ సంవత్సరంలోని పాటలన్నింటిలో మెలోడీ సాంగ్‌గా ముద్ర వేసుకొంది. ఇంటర్నెట్‌ సంచలనంగా మారిన ఈ పాటకు ఇప్పటి వరకు 1.9మిలియన్ల లైక్స్‌ వచ్చాయి.

https://twitter.com/GMBents/status/1518810628047077376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1518810628047077376%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fmahesh-babu-sarkaru-vaari-paata-movie-kalaavathi-song-hits-a-record-with-total-150-million-views-692998.html

ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన పెన్నీ, టైటిల్‌ ట్రాక్‌లు కూడా మంచి ప్రేక్షకాదరణతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోని మాస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయాలని ఈ చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.  ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌,14 రీల్స్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *