నెట్టింట వైరల్‌ అవుతున్న ప్రభాస్ పెళ్లి ముచ్చట్లు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో వేగం పెంచారు మేకర్స్. ఇక ప్రమోషన్స్‌లోనే ప్రభాస్‌ తన పెళ్లిపై స్పందించారు. ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Prabhas interesting comments on his marriage

ప్రభాస్‌ నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం ముంబయిలో వేడుకగా జరిగింది. ప్రేమ, విధికి మధ్య జరిగే పోరుని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలో ప్రభాస్‌ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇక ‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్‌లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అనే డైలాగ్ ఉంది. దీనిపై ఓ విలేకరి ప్రభాస్‌ని ప్రశ్నిస్తూ.. ‘ప్రేమ విషయంలో నిజజీవితంలో మీ లెక్క ఎన్ని సార్లు తప్పింది’ అని అడగ్గా.. ‘చాలా సార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి.. అందుకే నాకింకా పెళ్లి కావడం లేదనుకుంటా..’ అని ఫన్నీగా సమాధానమిచ్చారు. ఈ ఫన్నీ కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Prabhas interesting comments on his marriage

కాగా ప్రభాస్‌ రాధే శ్యామ్ తర్వాత ‘ఆదిపురుష్’ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ‘స్పిరిట్’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అలానే మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయబోతున్నారని టాక్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *