మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన పూజా హెగ్డే..!

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా పూర్తవక ముందే మరోసారి పూరీ దర్శకత్వంలో జనగణమన అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ.

Pooja Hegde on board for Vijay Deverakonda's Jana Gana Mana Movie

వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. జూన్‌ నెల‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌కానున్న‌ట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండతో జోడీకట్టే నాయిక ఎవరన్నది ఆసక్తిని కలిగిస్తోంది. ప‌లువురు అగ్ర‌క‌థానాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన పూరి జ‌గ‌న్నాథ్‌ చివ‌ర‌కు బుట్ట‌బొమ్మ పూజాహెగ్డేను ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. పూజాహెగ్డే కూడా ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ద్వారా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూజాహెగ్డే తొలిసారి జంటగా నటించబోతున్నారు.

Pooja Hegde on board for Vijay Deverakonda's Jana Gana Mana Movie

కథ నచ్చడంతో పాటు పాన్‌ ఇండియా సినిమా కావడంతో పూజాహెగ్డే వెంటనే అంగీకారం తెలిపిందని అంటున్నారు. దక్షిణాదితోపాటు… హిందీలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న పూజా ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ముంబైలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఆ సినిమాతోపాటే, ‘జనగణమన’ చిత్రాన్ని కూడా చేయనుంది. ముంబైలోనే చిత్రీకరణ షురూ చేయడానికి పూరి జగన్నాథ్‌ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘జనగణమన’లో విజయ్‌ దేవరకొండ సైనికాధికారిగా నటించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *