కడుపు ఉబ్బరంతో ఇబ్బందిపడేవాళ్లు ఇలా చేస్తేచాలు..

ఏదైనా తింటే గిట్టని వాళ్లకు వెంటనే కడుపు ఉబ్బరం నెట్టుకొస్తుంది. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిగ్గా ఒంట్లో హుషారు లేకపోవడం, కూర్చుకోవాలన్నా, నిల్చోవాలన్నా అనేక ఇబ్బందులను చవిచూడాల్సి వస్తుంది. అయితే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. మద్యం సేవించిన వారికి కూడా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు కూడా దారితీస్తాయి. అయితే కడుపు ఉబ్బరం నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

వామును ఒక మోతాదులో తీసుకుని బౌల్ లో దోరగా వేయించుకోవాలి. దీన్ని శుభ్రంగా ఉంచిన ఓ డబ్బాలో పొడిచేసి ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజూ అన్నం తినేటప్పుడు అన్నంలో మొదటి ముద్ధ తినేటప్పుడు ఒక పావు చెంచా పొండిని వేసుకుని తినాలి. దీని ద్వారా కడుపు ఉబ్బయం నయం అవుతుంది. శరీరంలో నీటి శాతాన్ని ఉంచుకుంటే అది కొవ్వు చేరకుండా చేసి, అధికంగా ఉన్న చక్కెరలు, ఉప్పులను బయటకు పంపి పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

అరటిలో పొటాషియం యొక్క గొప్ప మూలం, ఉబ్బరానికి కారణమయ్యే ఉప్పు సంబంధిత నీటిని నిలువరించడంలో ప్రభావితం చూపుతుంది. కాబట్టి అరటి తినడం వల్ల అదనపు సోడియంను బయటకు పంపించి ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. రోజుకు ఒకటి నుండి రెండు మాత్రమే తినాలి. గుమ్మడికాయలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది. పోటాషియం ఉండటం వల్ల అదనపు సోడియంను తొలగిస్తంది. ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *