రోజ్ వాటర్లో దాగి ఉన్న సౌందర్య రహస్యం

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు… తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సువాసనభరితమైన ద్రవంలో ఔషధ మరియు సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.ఇందులో కూడా వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేస్తే సన్ బర్న్ నుండి ఉపశమనం కలుగుతుంది. రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలను మరియు మచ్చలను నివారిస్తుంది.

అయితే కళ్ళలో రోజ్ వాటర్ పడకుండా చూసుకోవాలి. రోజ్ వాటరు కీటకాలు కుట్టిన ప్రదేశంలో అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఐ మేకప్ తొలగించడానికి కొద్దిగా రోజ్ వాటర్ అప్లై చేయాలి . రోజ్ వాటర్ మరియు జోజోబా ఆయిల్ రెండూ ఈక్వెల్ గా తీసుకొని అప్లై చేసి కాటన్ తో తుడవాలి. మొటమలు మరియు మచ్చలను వల్ల చర్మ దురదగా అనిపిస్తుంటే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇది ఇరిటేషన్ తగ్గిస్తుంది . జాస్మిన్ ఆయిల్లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ శరీరానికి అప్లై చేయడం వల్ల, శరీరం యొక్క దుర్వాసనను నివారిస్తుంది .

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *