కోనసీమ అల్లర్ల వెనక పవన్ హస్తం : మంత్రి అంబటి

చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పిదాలు మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని ప్రభుత్వం మీద మొత్తం రుద్దేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశం చంద్రబాబునాయుడకు, ఆయనను బలపర్చే ఎల్లో మీడియాకు ఉన్నట్లు కనిపిస్తోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘‘ఎందుకంటే జల వనరుల శాఖకు సంబంధించి, ఒక టెండర్‌లో ఒక షరతు పెట్టారు. ఒకే ఒక ప్రాంతంలో బాపట్ల డ్రైనేజీ డివిజన్‌లో రూ.13 కోట్ల పనులకు సంబంధించి. నిధుల అందుబాటులో ఉంచుకునే టెండర్లు పిలవాలని, అవి లేకుండా టెండర్లు పిలిస్తే బిల్లులు చెల్లించేటప్పుడు ఇబ్బంది అవుతుందని, అక్కడ ఎందుకో వ్యక్తిగత నిర్ణయం తీసుకుని షరతు పెట్టారు.

నిజానికి దాన్ని మా ప్రభుత్వం సమర్థించడం లేదు. పైగా అది మా దృష్టిలో కూడా లేదు.  రాష్ట్రంలో ఏదో జరుగుతోందని, రాష్ట్రమంతా అప్పుల పాలవుతోందని, అన్ని టెండర్లకు షరతులు పెడుతున్నట్లు ఒక పత్రికలో రాయడం, చంద్రబాబు దాన్ని పదే పదే ట్వీట్లు చేస్తూ, రాష్ట్రంలో అంతా గందరగోళంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఎన్ని వేల కోట్లు అప్పులు పెట్టారు.

ఎంత మందికి ఎగ్గొట్టారు. అన్ని అప్పులు పెట్టినాయన, అన్ని ఎగ్గొట్టిన ఆయన ఇవాళ నీతులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బకాయిలు వదిలిపెట్టి పోతే వైయస్‌ జగన్‌ అన్నీ తీర్చారు. నిజానికి దివాళా తీసిన ప్రభుత్వాన్ని చంద్రబాబు మాకు అప్పగించారు. అయినా మాపై పదే పదే బురద చల్లుతున్నారు. నిజం చెప్పాలంటే మేము బిల్లులు ఎగ్గొట్టడం లేదు. కోనసీమ అల్లర్ల వెనుక పవన్ కళ్యాణ్ హస్తం ఉందని ఆరోపించారు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *