టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేశ్ సంచలన కామెంట్లు

టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేశ్ సంచలన కామెంట్లు చేశారు. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడనని లోకేశ్ అన్నారు.  ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. లోకేశ్ మూర్ఖుడు అంటూ ప్రసంగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.  ‘‘చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులను వదిలిపెట్టను. అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా వదిలిపెట్టను. తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలిపెట్టను. నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇప్పుడిలాగే ఉండాలి. రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా టీడీపీకే సాధ్యం.

టీడీపీ ప్రజల పార్టీ.. జగన్ ది గాలి పార్టీ. టీడీపీది బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్. టీడీపీ పసుపు కుంకుమ ఇస్తే.. వైసీపీ పసుపు కుంకుమలు చెరిపేస్తోంది. చంద్రబాబు లాంటి విజనరీ కావాలా? – జగన్ లాంటి ప్రిజనరీ కావాలా? ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ముందుకు సాగారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగారు. తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ.

సామాన్యులను నాయకులను చేసింది టీడీపీ.  బడుగులకు 1982లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు అధికారం ఇచ్చింది టీడీపీనే.  బీసీలను చట్టసభల్లో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీయే.  దేశంలో సంక్షేమం ఏంటో చేసి చూపింది ఎన్టీఆరే. పేదలకు తొలిసారిగా రూ.2 కిలో బియ్యం అందజేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుకు ప్రధాని అవకాశాలు అనేకం వచ్చాయి. అవకాశాలు వచ్చినా ఏనాడు తెలుగు ప్రజలను వదిలిపెట్టలేదు’’ అని లోకేష్ మాట్లాడారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *