మహిళా కమిషన్ అంటే లెక్కలేదా? : వాసిరెడ్డి పద్మ

చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు నోటీసులు ఇచ్చామని వాసిరెడ్డి పద్మ అన్నారు. నోటీసులకు స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదని తెలిపారు. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ అంటే లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. విచారణకు హాజరైతే చేసిన తప్పు గురించి చెప్పాలనుకున్నామని పేర్కొన్నారు. బాధితురాలి పరిస్థితి పట్టించుకోకుండా నానా రచ్చ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలితో మాట్లాడుతుంటే నన్ను దుర్భాషలాడారని పేర్కొన్నారు. బాధితురాలి పట్ల మహిళా కమిషన్ పట్ల వ్యవహరించిన తీరుపై చంద్రబాబు, బొండా ఉమపై కచ్చితంగా చర్యలు ఉంటాయని వివరించారు.

గ్యాంగ్ రేప్ బాధితురాలి దగ్గరకు వందలమంది వచ్చారని వివరించారు. అత్యాచార బాధితురాలి మానసికపరిస్థితి పట్టించుకోలేదన్నారు. చంద్రబాబుతో పాటు అనేకమంది మగవాళ్లు వచ్చారని వివరించారు. బాధితురాలి ప్రతిష్టకు భంగం కలిగించారని అన్నారు. నేను పరామర్శకు వెళ్లకుండా తన విధులకు అడ్డుపడ్డారన్నారు. తనను చంద్రబాబు దూషిస్తూ బెదిరించారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను బహిర్గతం చేశారని వివరించారు. ఇన్ని తప్పులు చేసి తిరిగి కమిషన్ ను బెదిరిస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు, బోండా ఉమపై తీసుకునే చర్యలపై కమిషన్ సభ్యులతో చర్చిస్తామని, కచ్చితంగా చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే చంద్రబాబు, ఉమకు నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు బట్టారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాపాందులకు వైసీపీ అండగా నిలుస్తోందని ఆగ్రహం చేశారు. నిందితులకు ఇవ్వాల్సిన నోటీసులు, న్యాయం చేయాలని అడిగిన వారికి ఇవ్వం ఎంత వరకు సంమంజసం అని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *