మా ప్రభుత్వం మా ఇష్టం.. మీరెవరు అడగడానికి.?

మా ప్రభుత్వం..మా నిధులు..మీరెవరు అడగడానికి అంటూ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉగ్రరూరం ఎత్తారు. అయితే ఎప్పుడూ ప్రభుత్వ తీరు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసే ఆ ఎమ్మెల్యే ఈ సారి ప్రతిపక్షంపై ఒంటికాలు మీద లేచారు. నెల్లూరు జిల్లా, కోవూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్య నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం, మా నిధులు, మా ఇష్టం ఎక్కడైనా రోడ్లు వేస్తామని, అడగడానికి మీరెవరని ప్రశ్నించారు. ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Our government is ours..who are you to ask.?

టీడీపీ నేతలు ఇష్టానుసారంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమను 150 సీట్లతో గెలిపించారని పేర్కొన్నారు. ఇది మా ప్రభుత్వమని, బుచ్చిరెడ్డిపాలెంలో 18 మంది వైసీపీ కౌన్సిలర్లు చెలిచారని, అవసరమైతే లే – అవుట్లకు కౌన్సిలర్ల ఇంటికి కూడా రోడ్లు వేస్తామన్నారు. అడగటానికి మీరెవరని టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే గౌరవ సభలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా అనవసర మానుకోవాలని హితవు పలికారు. నిర్మాణాత్మక సలహాలివ్వాలని సూచించారు. అడిగితే టీడీపీ నేతల ఇళ్లకు కూడా రోడ్లు వేస్తామన్నారు. అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కడెక్కడ రోడ్లు వేశారో చెప్పాలని టీడీపీ నేతలు నల్లపురెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వైసీపీ ముందు వరుసలో ఉన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *