ఒరేయ్ లోకేష్ ముండా..! : మంత్రి నారాయణ స్వామి

ఒరేయ్ లోకేష్ ముండా..మా సీఎంనే తిడతావా అంటూ సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు. మండిపడ్డారు. అసెంబ్లీలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బిల్లు ప్రవేశపెట్టారు నారాయణ స్వామి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కల్తీ సారా అంటూ ప్రతిపక్ష  నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సారా వ్యాపారం చేశాడని ఆరోపించారు.

రూ.550 కోట్ల మద్యం ముడుపులు తీసుకున్నట్లు ఏసీబీ కోర్టులో కేసు నడిచిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు వ్యవస్థలను మోసం చేస్తారని, ఈ మధ్య కాలంలో తమ నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రంగా విమర్శిస్తున్నారని గుర్తు చేస్తూ ఒరేయ్ లోకేష్ ముండా..మా ముఖ్యమంత్రినే వాడూ..వీడూ..అంటావా అంటూ నారాయణ స్వామి రెచ్చిపోయారు. ఎస్సీలను అవినీతి పరులుగా చంద్రబాబు చిత్రీకరించారని మండిపడ్డారు. అసెంబ్లీలో నారాయణ స్వామి తిడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్వారు. మిగతా సభ్యులు కూడా నారాయణ స్వామిని నిలువరించడం మానేసి పెద్దగా నవ్వారు.

అయితే దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గు మంటున్నాయి. దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టడం వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శణమి టీడీపీ  సోషల్ మీడియాలో దెమ్మెత్తిపోస్తోంది. గతంలో భువనేశ్వరిని కూడా ఇదే రీతిలో అవమానించారని, ఇప్పుడు లోకేష్ ను ముండా అని సంభోదిస్తూ సభాసాంప్రదాయాలకు తిలోదకాలు తెస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బూతులను ఎంజాయ్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *