చంద్రబాబుని ఏకిపారేసిన మంత్రి కన్నబాబు.. కారణం ఏంటంటే?

తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ బంధాన్ని బలోపేతం చేసి రైతులకు, శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తుంటే.. మరొకవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మాత్రం రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ చిన్న బాబు విమర్శించారు. దేశంలో వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 4.8 శాతంగా ఉంటే, అందులో రాష్ట్ర వృద్ధి రేటు 9.3 శాతం ఉంది అని గుర్తు చేశారు.

వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని.. సీఎం జగన్ చర్యలతో ఇది సాధ్యం అయ్యింది అని.. నీతి అయోగ్ ఐ.సి.ఎ.ఆర్ శాస్త్రవేత్తలు, అలాగే ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిపుణులు సైతం జగన్ ని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. తాజాగా మంత్రి కన్నబాబు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు,లోకేష్ ట్వీట్స్ లో చేసిన వ్యాఖ్యలను మంత్రి కన్నబాబు ఖండించారు.

2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని మాట్లాడిన చంద్రబాబు ఆ తరువాత 2014లో వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను వంచించారని, అదే విధంగా 14 ఏళ్లుగా సీఎంగా చేసిన చంద్రబాబు రైతులకు ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చేకూర్చేరా అని చంద్రబాబుని ఏకిపారేసారు మంత్రి కన్నబాబు. అదేవిధంగా వైసిపీ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల లోపు రైతుల ఖాతాలలో 90 వేల కోట్లను జమ చేశారని మంత్రి తెలిపారు. ఇక మొక్కజొన్న, జొన్న, పత్తి, కూరగాయలు, మామిడి వంటి పండ్లను 6,434 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామని తెలిపారు. ఇక లోకేష్ అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరిస్తున్నారు అని.. కక్షపూరిత రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గుర్తించాలని మంత్రి కన్నబాబు విజ్ఞప్తి చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *