ఎన్టీఆర్ పాపం చంద్రబాబుకు తగులుతుంది : మంత్రి కొడాలి నాని

ఎన్టీఆర్ పేరుతో మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారని,  ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారుని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబుకి ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదు. ఎన్టీఆర్ చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు, లోకేశ్ నాశనం చేశారు. మళ్లీ ఎన్టీఆర్ బొమ్మతో ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తున్నారు. ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది.

ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది. ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే నైతిక హక్కు చంద్రబాబుకి లేదు. లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత వీళ్లకు లేదు. చంద్రబాబు తీసుకొచ్చాడని ప్రజలు గుర్తు పెట్టుకునేలా ఒక్క పథకమైనా ఉందా.?  జనం నుంచి వచ్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్. ఎన్టీఆర్ ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరు.

టీడీపీది 40 ఏళ్ల సంబరం కాదు.. 27 ఏళ్ల సంబరమే. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబుకు మీడియా మేనేజ్‍మెంట్ బాగా తెలుసు. టీడీపీకి బాకా ఊదడమే ఎల్లోమీడియా పని. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదే. అసెంబ్లీ జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ యత్నించింది. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలన్నదే టీడీపీ పాలసీ’’ అని తీవ్ర విమర్శలు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *