చంద్రబాబు నా వెంట్రుక కూడా పీక్కోలేరు : సీఎం జగన్

నంద్యాల సభలో మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా వెంట్రుక కూడా పీక్కోలేరు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వంపై చెడుగా ప్రచారం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో చెడుగా ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. కడుపు మంట అసూయతో బీపీ పెరిగి గుండెపోటుతో పోతారని చెలరేగిపోయారు. 2021-22 విద్యా సంవత్సరానికి రెండో విడత జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని నంద్యాలలో చేపట్టారు. 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాదేనని మండిపడ్డారు. ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని ఆగ్రమం వ్యక్తం చేశారు. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు. గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్న జీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియాకు పట్టట్లేదని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, ఎల్లో మీడియాలు ఉండటమేనన్నారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, ప్రజల దీవెనలతో ‘జగన్‌ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానన్నారు. దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటున్నాని పేర్కొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *