నీతిలేని నాయకుడెవరంటే భవిష్యత్తులో చంద్రబాబునే చూపిస్తారు : విజయసాయిరెడ్డి

నీతిలేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే చూపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు నాయుడు చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని పేర్కొన్నారు. చివరకు ఏకైక పుత్ర రత్నాన్ని మహిళలపట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారని దుయ్యబట్టారు. పిడకకూ ఒక ప్రయోజనం ఉంటుందని, పప్పు దానికి కూడా పనికిరాడని సెటైర్లు వేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుందని విమర్శించారు.

పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయని, ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టేనని స్పష్టం చేశారు. చంద్రబాబు, భజన మీడియా కాలంచెల్లిన మైండ్‌సెట్‌తో అక్కడే గిరికీలు కొడుతున్నారని విమర్శించారు. మరో ట్వీట్ లో  2004లో ‘అలిపిరి దాడి’పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయన్నారు. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారన్నారు.

దిక్కు తోచడం లేదు పాపం! శాసనాలు చేసే అధికారం చట్టసభలకే ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో సందేహమేల? ఎవరి పరిధిలో వారుండాల్సిన అవసరముందన్నారు. రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలూ పనిచేయాలి అని అన్నారు. న్యాయ వ్యవస్థ మీద అచంచల గౌరవం, విశ్వాసం  వైసీపీకి ఉన్నాయన్నారు. ఇందులోనూ సందేహం లేదని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య అసమతుల్యతను పోగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, ఈ యాగంలో జగన్ విజయం సాధిస్తారని తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *