ఆ విషయంలో ఎన్టీఆర్ ను హెచ్చరించిన తల్లి.. ఇవన్నీ సినిమాలకు మాత్రమే పరిమితం అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో కొనసాగుతున్న వారిలో ఎన్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసుడిగా ఎన్నో చిత్రాలలో బాలనటుడిగా ఆ తర్వాత హీరోగా నటించి విశేషప్రేక్షకాదరణ దక్కించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ RRRచిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా 7వ తేదీ జనవరి విడుదల కావడంతో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మీడియాతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ మీడియా సమావేశంలో హీరో అజయ్ దేవగన్ గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూసి పెరిగానని ఈక్రమంలోనే తనని ఒక గురువుగా భావిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. తన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆయన అనుభవం ముందు మేమింకా చిన్న పిల్లలమే అంటూ మాట్లాడారు.

ఇక అజయ్ దేవగన్ నటించిన పూల్ ఔర్ కాంటే చిత్రంలో అజయ్ దేవగన్ ఒకేసారి రెండు బైకులు పై చేసిన స్టంట్ ఇప్పటికీ నా మైండ్ లో మెదులుతూనే ఉందని. ఆ స్టంట్ ఎంతో అద్భుతంగా వచ్చిందని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. తనకు కూడా అలాంటి స్టంట్ చేయాలనే కోరిక ఉందని ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పినప్పుడు తన తల్లి తనకి హెచ్చరించిందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలాంటి సన్నివేశాలు అన్నీ కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతాయి బయట ఇలాంటి సన్నివేశాలు చేయడానికి వీలు లేదంటూ ఆమె తనని హెచ్చరించినట్లు ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలిపారు.

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *