మొట్టమొదటిసారి టాటూతో వార్తలు చదివిన యాంకర్.. నెట్టింట్లో వైరల్!
న్యూస్ యాంకర్ లు అనగానే మనందరికీ వారిపై ఒక ఉన్నత భావం కలుగుతూ ఉంటుంది. చాలామంది వారిని గౌరవించడం, తో పాటుగా ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఇక న్యూస్ యాంకర్ లు లైవ్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో వార్తలను టకటక గుడి కమింగ్ కాకుండా చదువుతూ ఉంటారు. అయితే న్యూస్ యాంకర్ లు ట్రెడిషనల్ గా, కొంతమంది స్టైలిస్ట్ గా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటారు. అదే న్యూస్ యాంకర్ లు టాటూలు వేయించుకుంటే ఇక అది ఒక సంచలనమే అని చెప్పవచ్చు.
అలాంటి సంచలనానికి తెరతీశారు న్యూజిలాండ్ న్యూస్ బులిటెన్ అయిన ఒరిని కైపారా.ఒరిని కైపారా అదే న్యూస్ యాంకర్ తన ముఖం పై టాటూ వేయించుకుంది. అయితే అది స్టైల్ కోసం కాదు.. అది ఒక సాంప్రదాయ టాటూ.. మారి అనే తెగలకు సంబంధించిన టాటూ. న్యూజిలాండ్ లో మారి అనే తెగ ప్రజలు పేదవారు. వారికంటూ ప్రత్యేక నృత్యరీతులు, అదేవిధంగా ఆచారాలు,పురాణాలు సంప్రదాయాలు, ఉన్నాయి. వారు ఎక్కువగా తమ నృత్యాన్ని ప్రదర్శిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు.
https://youtu.be/f17GT8SveIU
అలాంటి తెగ నుంచి వచ్చిన ఈ ఒరిని కైపారా తమ వారిలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈ టాటూ వేయించుకున్నట్టు సమాచారం. మారి అనే తెగకు చెందిన మహిళలు ఇలాంటి టాటూలు వేయించుకుంటారు. దీనినే మోకో కాయి అది అంటారు. 37 ఏళ్ల ఒరిని కైపారా తాజాగా న్యూస్ హబ్ లైవ్ లో టాటూతో కనిపించారు. ఇక ఆ లైవ్ లో ఆమెతో పాటుగా.. హోస్ట్ లు అయిన శ్యామ్ హాయెస్, మైక్ మెక్ రాబెర్ట్స్ కూడా పాల్గొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా న్యూస్ యాంకర్ గా పనిచేయడం తన జీవిత కథ అని తెలిపింది ఒరిని కైపారా.