తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్న నయన్‌తార..!

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లు తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదిలోనే నిశ్చితార్థమైంది. దీంతో వీరి పెళ్లి వార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకొందని.. జూన్‌ 9న వీరి వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Nayanthara and Vignesh Shivan to get married on June 9 in Tirupati?

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో స్వామివారి సన్నిధిలో నయన్, విగ్నేష్ ఒకటి కాబోతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారట. అనంతరం.. సినీ సెలబ్రిటీలు, ఇతర స్నేహితుల కోసం చెన్నైలో గ్రాండ్‌గా వివాహ విందు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తంతులో భాగంగా నయనతార, విగ్నేష్‌లు తిరుమల తిరుపతికి తమ పెళ్లి వేదికను బుక్ చేసుకోవడానికి వచ్చినట్లు సమాచారం.

తిరుమల వచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకునేందుకు వివాహ మండపాలను పరిశీలించారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీవారి ఆశీస్సులతో ఒక్కటి అయ్యేందుకు ప్లాన్ చేశారట.ఇప్పటివరకూ ఎప్పుడూ పెళ్లి వార్తలపై నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించిన దాఖలాలు లేవు. మరి, ఈసారైనా స్పందిస్తారో? లేదో? చూడాలి. మరోవైపు, విఘ్నేశ్‌ దర్శకత్వంలో నయన్‌, సమంత, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాతువక్కుల రెందు కాదల్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో నయన్‌-విఘ్నేశ్‌ గత కొన్నిరోజులుగా దేశంలోని పలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి వస్తున్నారు. అలా, వీరిద్దరూ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *