వరుడు షాక్… వధువు రాక్..

సోషల్ మీడియా లో అందమైన వధువులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు నెటిజన్లు కూడా బాగా ఇష్టం పడుతున్నారు. అందుకే వివాహానికి సంబంధించిన ప్రతీ చిన్ని చిన్ని వీడియోలు కూడా ప్రస్తుతం బాగా హడావిడి చేస్తున్నాయి. ఇక పెళ్లి కూతురు కొంచెం కొంటి తన ప్రదర్శిస్తే ఆ వీడియో కు చెప్పలేని అన్ని లైక్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కామెంట్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఓ కొంటె పెళ్లి కూతురు చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోని పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు ఓ ఫోటో గ్రాఫర్ తీశాడు.

Naughty bride video goes viral online netizen says so cute
Naughty bride video goes viral online netizen says so cute

ఇందులో వధువు ఒక కొంటెపని చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వధువు చేసిన కొంటె పనిని చూసి పిల్ల గడుసరే అని అంటున్నారు. పెళ్లి అయ్యాక ఇద్దరూ బంతిలో కూర్చుని ఉంటారు. ఇదే సమయంలో ఆ పెళ్లి కూతురు చిన్నప్పుడు అమ్మా నాన్న మనకు ముద్దులు పెట్టినట్లు వరుడుకు పెడతాను అని అంటుంది. దానికి వరుడు కూడా ఓ కే అన్నట్లుగానే ముందుకు వస్తాడు. అప్పుడే ఆ వధువు వరుడికి షాక్ ఇస్తుంది.

తాను పెట్టినట్టే పెట్టబోయి.. వెంటనే వెనక్కి లాగేసుకుంటుంది. ఆ ముద్దను తాను నోట్లో పెట్టుకుని తినేస్తుంది. ఇది అంతా పక్కన ఉన్న వధువు, వరుడు ఫ్రెండ్స్ చూస్తారు. దీనిని చూసిన వారు ఫక్కున నవ్వుతారు. అయితే ఇది జరిగేటప్పుడు వధువు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా ఉండవు. వీటిని చూసిన సగం మంది నెటిజన్లు వధువు అందాన్ని పొగుడుతున్నారు. దానితో పాటే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *