ఆ విషయాన్ని మా నాన్న వదిలినా.. నేను వదలను- నారా లోకేశ్​

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించడంతో వైకాపా, తెదేపా పార్టీల మధ్య అగ్గి రాజేసుకున్నట్లైంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దానికి తోడు టీడీపీ నేతలపై జరిగిన దాడులు మరింత వేడిని రగిల్చాయి. ఈ విషయంపై నారా లోకేశ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు సతీమణి బువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మరోసారి నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన తల్లిని కించ వరిచిన వాళ్లను మా నాన్న వదిలిపెట్టినా.. నేను వదలనంటూ శపథం చేశారు. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ.. ఇలా అవమానించడమేంటని ప్రశ్నించారు.

కావాలనే ఏదో విషయంలో తమ కుటుంబాన్ని లాగి.. అవమానించాలని వైకాపా ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు ఎంతగా ఇబ్బంది పెట్టారో.. భవిష్యత్తులో అంతకు రెట్టింపు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. నిన్నటి వరకు ప్రతిపక్షపార్టీ మీద దాడి చేయినంచిన వైకాపా నేతలు.. ఇప్పుడు తమ వాళ్లమీదే దాడి చేసి.. పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

గుంటూరు జిల్లాలో వెంకటరమణ అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి పెట్రోల్​తో నిప్పటించారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబు నాయుడిని దూషిస్తున్న వాళ్లను ప్రశ్నించడే నేరమైపోయిందని.. దీనికి వైకాపా ఏం సమాధానం చెప్తుంది?.. అని నిలదీశారు. తప్పు చేయడం తప్పని చెబితే చంపేస్తారా?.. అని ప్రశ్నించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *