నా చుట్టున్న మహిళలంతా ప్రజాప్రతినిధులే : సీఎం జగన్

రాష్ట్రంలో సాధికారతకు ప్రతినిధులుగా మహిళలు నిలుస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు. దేశ చరిత్రలో ఎక్కువమంది మహిళా ప్రతినిధులు ఉన్న రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. ప్రతి మహిళలో ఆత్మ విశ్వాసం కనిపిస్తోందన్నారు. మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఈ సభలో తన చుట్టు ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులే అని అన్నారు.

దేశంలోనే ఎక్కువ మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నది ఏపీలోనే అని, రాష్ట్ర మహిళలే ఇక్కడి మహిళా సాధికారతకు నిదర్శనం అని వివరించారు. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం వినియోగించామని తెలిపారు. రాజకీయ సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బిల్లులు పెడుతున్నారని ప్రకటించారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకే ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

102 మార్కెట్ కమిటీలకు అక్కా చెల్లెమ్మలకు ఛైర్ పర్సన్‌లుగా నియమించామని, ఏడుగురు జడ్పీ చైర్ పర్సన్‌లుగా నియమించుకున్నామని వివరించారు. వాలంటీర్ల ఉద్యోగాల్లో 53 శాతం మహిళలను నియమించామని, అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. పొదుపు సంఘాలకు రూ.12 వేలకు పైగా కోట్లు చెల్లించామని, ఈ 34 నెలల్లో మహిళలకు లక్షా 18 వేల కోట్లు అందించామన్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ తన మునుపటి వాగ్దాటితో అక్కడి మహిళలను ఆకట్టుకునున్నారు. దీంతో మహిళలంతా కేరింతలు కొట్టారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *