అనంతలో పెరిగిన పొలిటికల్ హీట్

అనంతపురం జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తమ స్టైల్లో విమర్శులు చేసుకుంటున్నారు. గెలుపుకోసం తాపత్రయ పడుతున్న నేతలు వినూత్న కార్యక్రమాలకు దిగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేపట్టిన పాదయాత్ర రాజకీయ వేడి పెంచింది.అనంతపురంలో 2014లో పోటీ చేసి విజయం సాధించిన ప్రభాకర్ చౌదరి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి చేతులో జగన్ ప్రభంజనంలో చిత్తయ్యారు. రాజకీయంగా జగన్ కు మంచి సన్నిహితుడు కూడా అనంత వెంకట్రామిరెడ్డి. 20 ఏళ్ల పాటు ఎంపీగా కూడా చేశారు. ప్రభాకర్ చౌదరికి రాజకీయ అనుభవం తక్కువ. అయితే ఇప్పుడు ఈ ఇరువురు అనంతపురం పట్టణంలో డీ అంటే డీ అంటున్నారు.  ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి  వరకు ప్రభాకర్ చౌదరిపై పెద్దగా విమర్శలు చేయలేదు.  తన అనుచరులు మాత్రం రోజూ ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి తాను పాదయాత్ర చేస్తానని తెలపడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.

మొన్నటి వరకు టీడీపీనే  అధికారంలో ఉందనీ, ఉన్నన్ని రోజులు అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితోనూ, అలాగే మేయర్ తోనూ నిత్యం వివాదాలు పెట్టుకుంటారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పనీ చేయని వాళ్లు పాదయాత్ర చేస్తామనంటూ జనంలోకి రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనికి ప్రభాకర్ చౌదరి కూడా అదే స్థాయిలో గట్టి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ చేతకాని తనాన్ని ప్రజల ముందు ఉంచేందుకే నాలుగు రోజులు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పి చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *