దాన్ని కంటే మరో బెస్ట్ ఆప్షన్ లేదంటున్న నమ్రత!

Namrata Shirodkar: నమ్రత శిరోద్కర్ ఈ పేరు టాలీవుడ్ హీరోయిన్ గా కంటే.. ప్రిన్స్ మహేష్ బాబు భార్య అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈమె మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. ఇక ఈ భామకు బాలీవుడ్ ప్రేక్షకులతో వేరే స్థాయిలో రాపో ఉందని చెప్పవచ్చు.

ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో వంశీ, అంజి, టక్కరి దొంగ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తన ఫ్యామిలీ ముచ్చట్లు ఇన్ స్టా లో అప్ డేట్ చేస్తుంది. ఇదే క్రమంలో మహేష్ బాబు సినిమా సంగతులు కూడా పంచుకొని ప్రిన్స్ అభిమానులను ఫిదా చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన పిల్లలతో కలిసి చేసిన ఓ స్పెషల్ మూమెంట్ ను పంచుకుంది ఈ భామ. అంతేకాకుండా దీని గురించి పలు ఎమోషనల్ కామెంట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవల జనవరి 22న నమ్రత పుట్టినరోజు సందర్భంగా తన భర్త మహేష్ బాబు, ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్ లు కలిసి బాగా ఎంజాయ్ చేసారు.

ఇక నమ్రత.. ఆ హ్యాపీ మూమెంట్స్ నుంచి ఒక పిక్ ను కలెక్ట్ చేసుకుని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. అంతే కాకుండా “పిల్లలతో ప్రతిరోజు జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు ” అంటూ తన ఇద్దరు పిల్లల పై ఉన్న ప్రేమను అలా మెన్షన్ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *