24 మందిని హత్య చేసిన కీర్తి సురేశ్.. ఆసక్తి రేకెత్తించేలా ట్రైలర్..!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుంటూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పింస్తుంది. , మహానటి, బ్యాడ్ లక్ సఖి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కీర్తి.. ఇప్పుడు మరోసారి వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అరుణ్ మథేశ్వరం తెరకెక్కిస్తున్న సినిమా ‘చిన్ని’. ఇందులో సెల్వ రాఘవన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాం ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో మే 6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Keerthi suresh chinni movie trailer released

ఈ సినిమాలో కీర్తి సఖినేటి పల్లికి చెందిన కానిస్టేబుల్‌ చిన్ని అనే పాత్రలో కనిపించనుంది. సెల్వరాఘవన్‌ చినగంజాంకు చెందిన రంగయ్య అనే పాత్రలో కనిపించనున్నారు. 24 మందిని హత్య చేసినందుకు ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేయడం.. వారిని విచారిస్తున్న క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకు రావడం.. వంటివి ట్రైలర్‌లో చూపించారు.  కీర్తి సురేష్, సెల్వ రాఘవన్‌ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్‌ సూపర్బ్‌ అనేలా ఉంది.  కీర్తి సురేశ్ విడోగా .. హంతకురాలిగా కనిపిస్తోంది. ఇక చిన్ని అన్ని హత్యలు ఎందుకు చేసింది. అసలేమైంది అనేది సస్పెన్స్.

ఓటీటీలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోయేలానే కనిపిస్తోంది. ఇక తెలుగులో కీర్తి సురేశ్ తాజా చిత్రంగా ‘సర్కారువారి పాట’ మే 12 వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇక నానీతో చేస్తున్న ‘దసరా’ సెట్స్ పై ఉంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *