‘కృష్ణ వ్రిందా విహారి’ రొమాంటిక్‌ టీజర్‌ చూశారా..?

లవర్ బాయ్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాగశౌర్య.. కమర్షియల్ చిత్రాల్లోనూ నటిస్తూ టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాల ఎంపిక చేసుకుంటున్న ఆయన.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ఎప్పటికప్పుడు తన లుక్, మేకోవర్ మార్చుకుంటూ నేటితరం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న ఈ యువ హీరో లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వంటి చిత్రాల నాగ శౌర్య చేస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా! ఇందులో కృష్ణ పాత్రలో నాగశౌర్య, వ్రింద‌ పాత్రలో షెర్లియా సేతి నటించారు. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

నాగశౌర్య నటన, కామెడీ టైమింగ్, షిర్లే సెతియాతో కెమిస్ట్రీ యువతను ఆకర్షించేలా ఉన్నాయి. టీజర్‌ చివర్లో.. ‘‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో సౌందర్యలా మీరు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా? అయినా పర్లేదు.. ఆ సినిమాలో వెంకటేశ్‌ కంటే మిమ్మల్ని బాగా చూసుకుంటా’’ అని నాగశౌర్య చెప్పే డైలాగ్‌ మెప్పించేలా ఉంది. కామెడీ, రొమాన్స్, మ్యూజిక్… మేళవింపుతో టీజర్‌ బాగుంది.

అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ‘ఛలో’, ‘అశ్వథ్థామ’ వంటి హిట్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఛలో’ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *