నా కల నెరవేరింది : మంత్రి రోజా

తన సొంత ఊరు కడప జిల్లా అని, వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనకు దేవుడు అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్ ఆశిస్సుల కోసమే ఇడుపులపాయను సందర్శన చేశానని తెలిపారు. ఆయనకు నివాలర్పించాలనే కడపకు వచ్చానని తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు దివంగత మహానేత  వైఎస్ తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని గుర్తు చేశారు. వైఎస్ తో కలిసి రాజకీయాలు చేయాలని ఎన్నో కలలు కన్నానని, ఆయన మరణించాక ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని గుర్తు చేశారు.

ఐరన్ లెగ్ అంటూ తనను ఎన్నోసార్లు టీడీపీ ఎమ్మెల్యే అవహేళన చేశారుని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న, శ్రీ కాళహస్తీశ్వరుడంటే అపారమైన భక్తి అని తెలిపారు. ఎమ్మెల్యే కావాలనేది తన కల అని,  రెండు సార్లు ఎమ్మెల్యే అయి కల నెరవేరిందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీర్వాదం తో మంత్రి ని కూడా అయ్యానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు సైనికుల్లా పని చేస్తానని స్పష్టం చేశారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

గతంలో టిమిట్ట రధోత్సవానికి వచ్చినప్పుడు జగన్ ను సీఎం చేయాలని వేడుకున్నానని గుర్తు చేశారు. తన కోరిక నెరవేర్చినందుకు మరోమారు కళ్యాణోత్సవానికి హజరయ్యానని తెలిపారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా పథకాలు అమలు చేస్తున్నారని,  లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలేనని స్పషం చేశారు. క్రీడలు ఎంతో అవసరం..ఇకపై జబర్దస్త్ చేయరా అని ఎంతో మంది అడిగారని, పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని వివరణ ఇచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *