సిడ్నీలో గ్రహాంతర వాసి.. వీడియో వైరల్​..!

గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మానవులకు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. ఆ దేశ రాజధాని అయిన సిడ్నీలో కనిపించిన ఓ చిన్న జీవిని చూసిన ఓ వ్యక్తి అది కచ్చితంగా గ్రహాంతర వాసి అయ్యి ఉంటుందని చెప్తున్నారు.

movement of aliens in Australia and a strange creature spotted
movement of aliens in Australia and a strange creature spotted

హ్యారీ హేస్​ అనే వ్యక్తి ఇటీవల సిడ్నీలో మార్నింగ్​ వాక్​ కు వెళ్లారు. అదే సమయంలో అతనికి చిన్న పరిణామంలో ఉన్న జీవి కనిపించింది. దీనిని చూసిన చాలా మంది ఏంటి ఇది అని ఆశ్చర్యానికి గురి అయ్యారు. సిడ్నీ వీధుల్లో కనిపించిన చిన్న జీవికి సంబంధించిన  వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ జీవి చాలా చిన్నదిగా ఉండడమే. అయితే ఈ జీవి ఇప్పటి వరకు సిడ్నీలో కనిపించలేదని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటిది చూడడం ఇదే మొదటి సారి అని  పేర్కొన్నారు.

దీనిని తొలి సారి చూసిన హ్యారీ హేస్  మాత్రం ఇది కచ్చితంగా గ్రహాంతర వాసి అయ్యి ఉంటుందని అంటున్నారు. దీనికి గల కారణాలను కూడా  వివరించారు. తాను చూసినప్పుడు అది ఒక రకమైన పిండం ఆకారంలో ఉందని చెప్పాడు. అయితే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధ సూచనలు ఉన్న కారణగా గ్రహాంతర వాసులు వస్తున్నారని పేర్కొన్నాడు. ఈ వింత జీవి కూడా అందులో భాగమే అయ్యి ఉంటుందని అన్నారు. అయితే ఆయన షేర్​ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *