కేవలం బట్టలు సర్దడానికే యాభై వేలు తీసుకుంటుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే!

Viral:  చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ తమ ఉద్యోగాలలో మునిగిపోతూ ఉంటారు. అయినప్పటికీ వారికి వచ్చే నెలసరి జీతం వారికీ అసంతృప్తిని ఇస్తుంది. కానీ ఇంగ్లాండ్ లో ఓ మహిళ కేవలం బట్టలు సర్దడానికి నెలకు 50 వేల జీతం తీసుకుంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Viral
Viral

ఆమె పేరు ఎల్లా మెక్ మాహొన్. ఆమెకు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆమె ఓ స్టూడెంట్. ఇంగ్లాండ్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అసలు ఆమె చేసే జాబ్ ఏమిటంటే.. మామూలుగా మన దేశంలో బట్టలు బీరువా, అల్మరాలో సర్ది పెట్టుకుంటాం. కానీ విదేశాల్లో అలా కాదు. వాళ్ళు వార్డ్ రోబ్ లో బట్టలు సర్దిపెట్టుకుంటారు. కానీ వాళ్ళకు బట్టలు సర్దుకునే టైమ్ కూడా లేక ఆ పని వేరే వాళ్ళతో చేయించి వాళ్లకు డబ్బులు ఇస్తారు. ఇదే క్రమంలో ఆ యువతి ఆ జాబ్ లో జాయిన్ అయింది.

ప్రతిరోజూ 3 నుంచి 9 గంటల పాటు పని చేస్తుంది. వార్డ్ బోర్డు లో బట్టలను పద్ధతిగా శ్రద్దగా సర్దుతుంది. కలర్స్ ను బట్టి బట్టలను సర్దుతుంది. బట్టల రకాలను బట్టి వాటిని అమర్చుతుంది. ఆమె ఆ పని చేయడం పూర్తి అయిన తరువాత ఆ గ్యాలరీ ని ఎవరైనా చూస్తే అబ్బా.. అనాల్సిందే. ఎందుకంటే అంత చక్కగా సర్దుతుంది. అలా చేయడం అంత సులభమేమి కాదు. అదొక ఆర్ట్.

ఆ పనిని ఎల్లా..ఎంతో ఇష్టంతో చేస్తుంది. గంటకు 1500 నుంచి 2000 దాకా తీసుకుంటుంది. ఎల్లా ‘సిండ్రెల్లాస్క్లోసెట్’ అనే తన ఇన్ స్టా ఖాతాలో ఈ పని కి సంబంధించిన వీడియో క్లిప్ లను పోస్ట్ చేస్తూ నెటిజన్ల ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక మీరెందుకు ఆలోచిస్తున్నారు మీరూ ఓ లుక్కేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *