ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు..శాఖల కేటాయింపు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టిన వారికి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఏపీ సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వం వారికి శాఖలు కేటాయించింది. అయితే ఈ కార్యక్రమానికి పలువురు మాజీమంత్రులు హాజరవ్వగా మరికొందరు దూరంగా ఉన్నారు. శాఖలు తీసుకున్నవారి వివరాలు ఇళా ఉన్నాయి. ధర్మాన ప్రసాదరావు: రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అండ్ స్టాంప్స్, సీదిరి అప్పలరాజు: పశుసంవర్థకశాఖ, బొత్స సత్యనారాయణ: విద్యాశాఖ, పి.రాజన్న దొర: గిరిజన సంక్షేమ శాఖ, గుడివాడ అమర్నాచథ్ : పరిశ్రమల శాఖను కేటాయించారు.

బూడి ముత్యాలనాయుడు : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ, పినెపె విశ్వరూప్ : రవాణాశాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాట్రోగ్రఫీ, తానేటి వనిత : హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, కారుమూరి నాగేశ్వరరావు : పౌరసరఫరాల శాఖ, కొట్టు సత్యనారాయణ : దేవదాయశాఖ, జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ, మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ, విడదల రజినీ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ అప్పగించారు.

అంబటి రాంబాబు : జల వనరుల శాఖ, ఆదిమూలపు సురేష్ : పురపాలక, పట్టణాభివృధి శాఖ, కాకాణి గోవర్ధన్రె డ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ, ఆర్కే రోజా : పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ, నారాయణస్వామి : ఎక్సైజ్ శాఖ, అంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ, బుగ్గన రాజేంద్రనాథ్: ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు, స్కిల్ డెవలప్మెం ట్, గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ, ఉపాధి కల్పన, ఉషాశ్రీచరణ్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శాఖల్లో నియమించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *