ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. వైకాపా సింగిల్​గా బరిలోకి దిగుతుంది-పెద్దిరెడ్డి

అమరావతి రాజధాని విషయంలో రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా నిలుస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే భారీ నిరసలతో పోరుబాట పట్టిన రైతులు ఈ ఉద్యమంతో తమ నినాదాన్ని రాష్ట్రమంతటా వినిపిస్తూ.. మాహాపాదయాత్రకు నాంది పలికారు.

తాజాగా, ఈ పాదయాత్ర తిరుపతికి చేరుకుని.. అక్కడితో ముగియనుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభా సమావేశంలో చంద్రబాబుతో పాటు, ఏంపీ రఘురామ కృష్ణరాజు, తదితర కీలక నాయకులు పాల్గొన్నారు. రాజధానిని మార్చడం ఎవ్వరివల్లా కాదని అన్నారు.

Peddireddy ramachandra reddy sensational comments on oposition parties

కాగా, తాజాా, ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ ముసుగులో అమరావతి ఉద్యమం సాగుతోందని విమర్శించారు.  భాజపాతో ఎలాగైనా జతకట్టాలని చంద్రబాబు సాయశ్తులా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా.. వైకాపా సింగిల్​గా బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి.

తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. న్యాయస్థానుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఈ ఉద్యమ సభ నిర్వహించారు. ఈ సభకు పలువురు రాజకీయ నేతలు హాజరై రైతులకు మద్దుతగా నిలిచారు. అమరావతి విషయంలో ఎవ్వరూ ఏం చేయలేరని.. కాస్త ఓపిక పడితే రాజధాని అమరావతిగానే ఉంటుందని ధైర్యం చెప్పారు రఘురామ. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పటికి సరైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *