ఏపీ ప్రజలకు శుభవార్త తెలుపుతూ ఆ డబ్బును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న జగన్ సర్కార్!

ఏపీ విద్యుత్ వినియోగదారులకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఇప్పటివరకు ఏపీ ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసిన ఏపీ ప్రభుత్వం ఇకపై ఆ డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ డబ్బులను నవంబర్ లో వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో భాగంగా డిసెంబర్ నెలలో విద్యుత్ బిల్లు చార్జీలను తగ్గించనున్నారు. ట్రూ అప్ చార్జీలు కింద వసూలు చేసిన ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెల విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయనుంది.

ఇందుకు సంబంధించిన డిస్కమ్ లకు కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీలను వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వసూలు చేసిన ట్రూ అప్ చార్జీల గురించి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల APERC కి ట్రూ అప్ చార్జీలను వసూలు చేయడం విరమించుకోవాలని పలువురు అభ్యర్థనలు చేశారు.

ఈ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో వసూలు చేసిన చార్జీలను తిరిగి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు లాభం చేకూరుతుంది. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం తమ అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని చార్జీలను తిరిగి వెనక్కి చెల్లించడంతో పలువురు ఏపీ ప్రభుత్వం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేం చేసిన కృషికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *