అమితాబ్ పాటకు ట్రాఫిక్ పోలీస్ స్టెప్పులు.. వీడియో వైరల్..!

కొంత మంది ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులు సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారుతుంటాయి. గతంలో ముంబయి పోలీసులు తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టిన పుష్ప సినిమాలోని శ్రీవల్లీ అనే పాటను అధికారికంగా భరాత్ లో వాయించినట్లు వాయించి వైరల్ అయ్యారు. ఇలా పోలీసులు కొన్ని సార్లు వారు చేసిన పనుల వల్ల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నారు. ఇలానే ఓ ట్రాఫిక్ పోలీసు ఓ వ్యక్తితో కలసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.

traffic cop dancing
traffic cop dancing

హిందీ నటుడు అమితాబ్ బచ్చన్, పర్వీన్ బాబీలు జంటగా నటించిన ఓ సినిమాలోని జాను మేరీ జాన్‌కి అనే సాంగ్ కు వీరిద్దరూ కలసి నృత్యం చేశారు. దానిని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సమాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది తెగ వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది ఆ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుతున్నారు. ఈ వీడియో ను ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో ఐదు వేల కు పైగా మంది చూశారు. వారిదైన శైలి లో ఆ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు. మరో వైపు ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా పోస్ట్ చేశారు. ఈ విధంగా పోలీసులు.. పబ్లిక్ తో కలిసి స్టెప్పులు వేయడం అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు మంచి ఉదాహరణ అని చెప్తుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *