మనోడి సిక్స్ ప్యాక్ ఐడియా మామూలుగా లేదుగా..!

మనలో చాలా మంది ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. దానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం అని కొందరు జిమ్ కు పోతారు. మరి కొందరు ఇంట్లో ఉండే వర్క్ అవట్లు చేస్తారు. ఇలానే ఓ వ్యక్తి కూడా చాలా చాలా ఫీట్లు చేసి చివరకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇలా అయినా సరే తన సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఇందుకు ఆ వ్యక్తి వేసిన మాస్టర్ ప్లాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు? అక్కడ జరిగింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

man a six pack  in two days
man a six pack in two days

సిక్స్ ప్యాక్ కోసం విపరీతంగా ప్రయత్నించిన ఓ బద్దకిస్టూ..  విఫలయత్నంతో నిరాశ చెంది మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. తనకు తెలిసిన ఓ ట్యాటూలు వేసే ఓ వ్యక్తిని ఆశ్రయించాడు. ఇలా తన సిక్స్ ప్యాక్ ఆశను ఆ వ్యక్తి తెలిపాడు. ఇద్దరూ కలిసి సమాలోచనలు చేసిన అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వ్యక్తి కోరుకున్న సిక్స్ ప్యాక్ ను ట్యాటూ వేసేందుకు సిద్దం చేసాడు.

కేవలం రెండు రోజుల్లోనే సిక్స్ ప్యాక్ ఆ వ్యక్తి సొంతం అయ్యింది. ఈ  వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన చాలా మంది నవ్వుకుంటున్నారు. వారి మిత్రులకు షేర్ చేస్తున్నారు. అంతేగాకుండా.. ఇలా కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తారా బ్రో అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ వ్యక్తి చేసిన వీడియో ఓ రేంజ్ లో వైరల్ కావడం విశేషం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *