స్టేజ్‌పైనే ఎమోషల్‌ అయిన మహేశ్‌బాబు.. ఎందుకంటే..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తుంది. మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక శనివారం నాడు ఘనంగా జరిగింది.

Mahesh Babu Turned Emotional At  Sarkaru Vaari Paata Pre Release Event

ఈ సందర్భంగా మహేశ్‌ బాబు తన అన్నయ్య రమేశ్‌బాబుని తలచుకొని ఎమోషనల్‌ అయ్యాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు ( కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్‌ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు). కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్‌) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్‌ అయ్యారు.

‘‘రెండేళ్లయింది ఇలాంటి వేడుక చేసుకుని. అభిమానుల్ని చూస్తుంటే ఆనందం కలుగుతోంది.    దర్శకుడు పరశురామ్‌ నా పాత్రని చాలా బాగా డిజైన్‌ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయి. హీరో హీరోయిన్‌ ట్రాక్‌ కోసమే మళ్లీమళ్లీ థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులు ఉంటారు. కీర్తి నటన ఆశ్చర్య పరుస్తుంది. తమన్‌ పాటలు, నేపథ్య సంగీతం ఇరగదీశాడు. రామ్‌ లక్ష్మణ్‌, ఛాయాగ్రాహకుడు మధి, నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌, కళా దర్శకుడు ప్రకాశ్‌, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌, గీత రచయిత అనంతశ్రీరామ్‌, దర్శకత్వ బృందం… అలా అందరూ అత్యుత్తమ పనితీరుని  కనబరిచారని” మహేశ్‌ బాబు చెప్పుకొచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *