ఆయన మరణంతో మహేష్ బాబు ఇంట్లో తీరని విషాదం!

టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గూఢచారి 116 తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని ఆపై 80 సినిమాలు పైగా సినిమాల్లో నటించి తన నటనకు ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుత టాలీవుడ్ అల్ట్రా స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక కృష్ణ వారసులైన రమేష్ బాబు, మహేష్ బాబుల గురించి కూడా మనకు తెలుసు. మహేష్ బాబు ఇండస్ట్రీలో కొన్ని సక్సెస్ లు అందుకొని ఏకంగా సూపర్ స్టార్ అనే తన తండ్రి బిరుదును కొట్టేశాడు. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు కూడా బాలనటుడుగా సినీ రంగంలో అడుగు పెట్టి.. మొదటి సినిమా సామ్రాట్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఇక ఆయన చివరిగా అప్పటి డైరెక్టర్ ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్ కౌంటర్’ సినిమాతో సినీరంగానికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సినీ నిర్మాతగా క్లిక్ అయ్యాడు. ఇరవై సినిమాలలో పైగా నటించి తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఆయన కొన్ని గంటల క్రితమే కన్నుమూశారు.

కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న ఆయనను.. హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఏ ఐ జి’ హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా కొన్ని గంటలు క్రితమే స్వర్గస్తులయ్యారు. ఈ ఘటన ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం గా మారింది. అందులోను 56 ఆరేళ్లకే మరణించడం ఈ కుటుంబానికి తీరని లోటు చోటుచేసుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *