హైదరాబాద్ లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన మహేష్ బాబు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు వరుసగా స్థలాలను కొనుగోలు చేసి ఇంటిని నిర్మించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ప్రభాస్ 120 కోట్లు పెట్టి స్థలాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు కూడా హైదరాబాద్లో స్థలం కొనుగోలు చేశారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు జూబ్లీహిల్స్ లోని ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు దాదాపుగా 1442 చదరపు గజాల్లో విస్తరించి ఉందని సమాచారం. నవంబర్ 17, 2021న ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని సుమారు 26 కోట్లు చెల్లించి ఈ ఫ్లాట్ ను మహేష్ బాబు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టాంపుడ్యూటీగా దాదాపు రూ1.43కోట్లు చెల్లించారని వినికిడి. పేరు బదిలీకి గాను రూ. 39లక్షలు చెల్లించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇప్పటికే మహేష్ బాబుకు చెన్నై హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఖరీదైన ఆస్తులు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి హైదరాబాదులో ఎంతో ఖరీదు చేసే ఫ్లాట్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, పలు వ్యాపార రంగాలలో తనదైన శైలిలో దూసుకుపోతూ పెద్ద మొత్తంలోనే ఆస్తులు పోగు చేశాడని తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *