బిగ్‌ బాస్‌లో ఫస్ట్‌ ఎలిమినేటైన ముమైత్‌.. ఆర్‌ జే చైతుపై ఫైర్‌..!

మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్‌లో ఆదివారం ఎపిసోడ్‌తో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఒక్కొక్కరి గురించి చాలా క్లుప్తంగా మాట్లాడారు నాగార్జున. బిందు మాధవి చాలా బాగా గేమ్ ఆడిందని పొగిడారు . యాంకర్ శివపై పంచ్ లు వేశారు నాగ్. దాదాపు అందరి కంటెస్టెంట్స్ గేమ్ తీరుని కొనియాడిన నాగ్.. ఆర్జే చైతుని గేమ్ కరెక్ట్‌గా ఆడాలని సూచించారు.

Elemination starts in big boss ott

ఇక నామినేషన్స్‌లో అందరూ సేఫ్‌ అవ్వగా.. చివరకి మిగిలిన సరయు, ముమైత్‌లకు ఒక టాస్క్ పెట్టి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాకయ్యారు. సరయు తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. ముమైత్ తన ఎలిమినేషన్‌ని ఊహించలేదు. దీంతో తనను రాంగ్ పోట్రే చేశారంటూ బాధపడింది. అఖిల్‌ని పట్టుకొని ఏడ్చేసింది. స్టేజ్‌ మీదకి వచ్చాక హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి తన ఒపీనియన్ చెప్పింది. ఇక ముమైత్ ఖాన్ హౌస్ నుంచి బయటకొచ్చేశాక.. ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ బజ్‌లో పాల్గొంది. యాంకర్ రవి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ముమైత్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది ముమైత్ ఖాన్. ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో ట్యాగ్ ఇచ్చింది.  బిందు మాధవికి స్నేక్ ట్యాగ్ ఇచ్చింది. సరయుకి మహానటి, శ్రీరాపాకకు పొగరని చెప్పిన ముమైత్.. హౌస్ లో బాగా కనెక్ట్ అయిన అజయ్‌కి లవ్ సింబల్ పెట్టింది. బిందు మాధవి చాలా క్యాలుక్యునేషన్‌తో గేమ్ ఆడుతుందని చెప్పింది. ఇక తను ఎలిమినేట్ కావడానికి ఆర్జే చైతునే కారణమని.. అతడు పెద్ద ఫేక్ కంటెస్టెంట్ అని చెప్పింది. అంతేకాదు.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వబోయేది కూడా అతడేనని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *