కేజీఎఫ్‌-2 రికార్డ్‌ కలెక్షన్స్‌..!

కన్నడ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన KGF-1క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సత్తాను చాటింది. ఈ దెబ్బతో KGF-2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన Kgf Chapter 2 అంచనాలను మించి దూసుకుపోతోంది. ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతున్నాడు రాఖీ బాయ్. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

KGF-2 boxoffice record collections

రాకీభాయ్ క్రేజ్‌కి బాక్సాఫీస్ షేక్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లను సాధిస్తోంది ఈ సినిమా. వీకెండ్‌లో భారీ వసూళ్లను సాధించి రికార్డ్స్ సృష్టించింది ‘కేజీఎఫ్2’. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.546 కోట్లను వసూలు చేసింది. హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటకలో రూ.91కోట్లు, ఏపీ-తెలంగాణలో కలిపి రూ.84.80 కోట్లు, తమిళనాడులో రూ.32.10 కోట్లు, కేరళలో రూ.29.05 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. మొత్తం కలిపి వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.546 కోట్ల గ్రాస్‌ను సాధించింది.

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలను పోషించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *