రూ. 90 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. 20 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. నటిగా ఆమెకి మంచి క్రేజ్ ఉంది కానీ తరచూ వివాదాల్లో దూరుతుంటుంది. ఎవరేమనుకున్నా.. తనేం చేయాలనుకుంటే అది చేస్తుంది. సెలబ్రిటీలు, రాజకీయనాయకులపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె నటించిన ‘ధాకడ్’ సినిమా మే 20న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు తొంబై కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు.

Kangana Ranauth Dhaakad movie collections

సినిమా టీజర్‌, ట్రైలర్‌ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది. ధాకడ్‌ మూవీలో యాక్షన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలన్నీ తారుమారయ్యాయి. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం (మే 27) దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది.

కంగనా కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. మొదటి వీకెండ్‌లో కాస్తో కూస్తో వసూలు చేసిన ఈ సినిమా రెండో వారానికి పూర్తిగా డల్ అయింది. ఈ సినిమాకి వచ్చిన టాక్‌తో డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి కూడా ఏ సంస్థ ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దర్శకనిర్మాతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘భూల్ భులైయా2’ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హారర్ కామెడీ రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోబోతుంది. కానీ ‘ధాకడ్’ మాత్రం మినిమమ్ కలెక్షన్స్ లేక బోల్తా కొట్టింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *