14 కేసుల్లో నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా.? : ధూళిపాళ్ల నరేంద్ర

కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకమా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నాయకులు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. ఏడు కేసుల్లో కాకాణి గోవర్థన్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు అని ఆరోపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చాలని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ1గా ఉన్నారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పొన్నూరులో మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన దొంగ తనంలో ఎస్పీ విజయారావు కల్పిత కథ బాగా అల్లారని ఆరోపించారు.

14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా? అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా? అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వక చోరీ జరిగిందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చోరీలో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే చోరీ జరిగిందా? అని అన్నారు.

మంగళగిరిలోని విల్లాలో మహమ్మద్ అనే వ్యక్తి చనిపోయాడని, ఏసీ మెకానిక్ మహమ్మద్ మృతిపై చాలా అనుమానాలున్నాయని పేర్కొన్నారు. మహమ్మద్ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి అని ప్రశ్నించారు. సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. పోలీసుల దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ఇదిలా ఉండగా కోర్టులో జరిగిన దొంగతనం పలు మలుపులు తిరుగుతోంది. కాకాణిపై ఆరోపణలు వచ్చినా ఆయన ఇప్పటికీ దానిపై స్పందించలేదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *