బీట్రూట్ ప్రయోజనం తెలిస్తే తినకుండా ఉండరు..!

శక్తినిచ్చే శాక దుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీన్ని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కూరను కూడా తక్కువగానే వండుకుని తింటారు. దాన్నివాడే వారిలో కూడా జ్యూస్ గా తాగేందుకు మాత్రమే ఎక్కువ మంది ఇష్టపడతారు. బీట్ రూట్ తినడం వల్ల కడుపులో కోతగా ఉంటుందన్న భయంతో కొందరు దరి చేరనివ్వరు.అయితే ఈ బీట్ రూట్ తింటే ఎంత ప్రయోజనం ఉందో తెలిస్తే దాన్ని తినకుండా ఉండలేరు. అవి ఏంటంటే…బీట్ రూట్ కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచి కూడా చేకూరుస్తుంది. బీట్ రూట్ లో కొవ్వు కెలరీలు తక్కువగా ఉంటాయి.

ప్రతి రోజు ఓ గ్లాస్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. ఉదయాన్నే తాగడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో అనువైనది.  రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ను ఉపయోగిస్తే మంచిది. రక్తం తక్కువగా ఉండేవారు దీన్ని తింటే హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగి రక్తం పెరుగుతుంది. నీరసంతో ఇబ్బందిపడేవారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా, జ్యూస్ తాగినా తేరుకుంటారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా దీన్ని తీసుకోవచ్చు. కండరాల్లో శక్తి పెంచుకోవాలంటే బీట్ రూట్ రసం తప్పనిసరిగా తాగాల్సిందే.

ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. కాబట్టి తరచూ బీట్ రూట్ రసం తాగడం వల్ల.. కండరాలూ, శారీరం దృఢంగా తయారవుతాయి.  శరీరంలో పొటాషియం లెవల్స్ తగ్గితే అలసట, బలహీనపడటం, తిమ్మిర్లు వంటివి సంభవిస్తాయి. మనిషికి కావాల్సిన పొటాషియం బీట్ రూట్ లో అధికంగా ఉంటుంది. అంతేకాదు బీట్ రూట్ తినడం లేదా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు తగ్గడం, అల్జిమర్స్ వచ్చే వేగం తగ్గడం మాత్రం జరుగుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *