Chiranjeevi: అలాంటి పంచాయతీలు నేను చేయను.. ఆపదలో ఆదుకుంటా చిరంజీవి షాకింగ్ కామెంట్స్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. ఈ సమయంలోనే సినీ కార్మికులకు ఇచ్చిన తన ముందుండి వారి కష్టాలను తీరుస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు ఎంతో అండగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా సినీ కార్మికుల కోసం 50 శాతం రాయితీ ఇవ్వాలని డయాగ్నస్టిక్ సెంటర్ అధికారులను అడగడంతో వెంటనే వారు సినీ కార్మికులకు 50% రాయితీతో ఉచిత పరీక్షలు వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.ఇలా అడిగిన వెంటనే సహాయం చేసినందుకు వారికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే సినీ కార్మికుల కోసం 50 శాతం రాయితీతో హెల్త్ కార్డులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విధంగా సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఇలా తమదైన శైలిలో సహాయం చేయడంతో సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి సమర్ధుడని అందుకే ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఉండాలని చాలామంది కోరారు. దాసరి నారాయణ రావు మరణం తరువాత ఇండస్ట్రీకి పెద్దగా ఎవరూ లేరు ఆ బాధ్యతలు చిరంజీవి తీసుకోవాలని చెప్పడంతో చిరంజీవి ఆ పదవికి తను అర్హుడు కాదని అలాంటి బాధ్యత నాకొద్దని తెలిపారు.
ఇలా సినీ పెద్దగా ఉండి పంచాయతీలు చేసే వ్యవహారం తనకు వద్దని, సినీ కార్మికులు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి తాను ముందు ఉంటానని, వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆదుకుంటానని ఈ సందర్భంగా చిరంజీవి సినీ కార్మికుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని ఎంత సున్నితంగా ఆ బాధ్యత తనికి వద్దంటూ తిరస్కరించారు. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ గా మారాయి.