హృతిక్‌కు బిగ్ హాగ్ ఇచ్చిన మాజీ భార్య.. ఎందుకో తెలుసా?

Hrithik: బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ అనే పేరును సైతం ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదాని మోస్తున్నాడు. ఇక తనకే కాకుండా అతని సినిమాలకు కూడా ఫాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం హృతిక్ రోషన్ హిందీ వెర్షన్ లో ఓ తెలుగు వెలుగుతున్నాడు. ఇక ఈ బాలీవుడ్ గ్రీకు వీరుడు ఇటీవలే జనవరి 10న బర్త్ డే జరుపుకున్న సంగతి తెలిసిందే.

Hrithik
Hrithik

ఈ క్రమంలో అతని మాజీ భార్య సుసానే ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా తన ఇన్ స్టా ఖాతాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టింది. హృతిక్ తన కొడుకులతో ఉన్న వీడియో క్లిప్ ను సుసానే తన ఇన్ స్టా లో పంచుకుంది. అంతేకాకుండా ‘ఫాదర్ గోల్స్’ అని కాప్షన్ కూడా ఇచ్చింది. వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు హ్రీహాన్, హ్రీదాన్ ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే..

‘హ్యాపీ, హ్యాపీ బర్త్ డే రే..హ్రీహాన్, హ్రీదాన్ లు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారి నాన్నగా నిన్ను పొందారు. నీ కలలు, నీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ.. నీకు ‘బిగ్ హాగ్ ‘ అని సుసానే ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆనందంగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సుసానే ఖాన్, హృతిక్ రోషన్ ఇద్దరూ 2000 సంవత్సరంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కొంతకాలం జీవితం బాగానే గడిపిన ఈ జంట ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం మనస్పర్థలు వచ్చాయో కానీ అక్కడితో వీరిరువురి బంధాన్ని తెంచుకున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *