బీచ్ లో పడిన హెలికాప్టర్… వీడియో వైరల్!
ఓ హెలికాప్టర్ బీచ్లో కూలిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది. సాధారణంగా ఇప్పటి వరకు అయితే మనం హెలికాప్టర్ క్రాష్ లాంటివి చూశాము. వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా మనం విన్నాం. ఒక్కొక్క దాని వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది. కారణాలు ఏవైనా కానీ లక్షలు వెచ్చించి తయారు చేసే హెలికాప్టర్ అనేది కుప్ప కూలడం అనేది దారుణం.
ఇటీవల బ్రిటన్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దీనికి కారణం యూనిస్ తుపాను. వచ్చినప్పుడు గాలులు భారీగా వీచాయి. అయితే ఈ భారీ ఈదురు గాలుల కారణంగా ఓ విమానం చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆ బీభత్సానికి విమానం నడుపుతున్న పైలట్లు ప్రమాదకరంగా ల్యాండ్ చేశారు. ఇలాంటి ఘటన లాంటిదే బీజ్లో హెలికాప్టర్ పరిస్థితి కూడా. దానిలో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా అందరూ చూస్తుండగానే ఆ సముద్ర తీరంలో పడిపోయింది. ఆ సమయంలో అలలపైకి దూసుకవచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలోని ఫ్లోరిడా. ఇదీ చాలా రద్దీగా ఉండే బీచ్. మియామీ బీచ్లో ముగ్గురు ప్రయాణికులతో ఈ హెలికాప్టర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీనిని రాబిన్సన్ R44 హెలికాప్టర్ గా అధికారులు గుర్తించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన దాని ప్రకారం నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రాష్ లో బీచ్ లో పడిన ఆ హెలికాప్టర్ విడి భాగాలను తరలించారు. ఇందులో ఉన్న సిబ్బంది గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition.
1/2 pic.twitter.com/heSIqnQtle
— Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022