మ్యాచ్​ మధ్యలో ముష్ఠి యుద్ధం.. పిడిగుద్దులతో..!

పశ్చిమ దేశాల్లో ఫుట్​ బాల్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్​ కు ఎంత క్రేజ్​ ఉందో అమెరికా, బ్రిటన్​, జర్మనీ, పోర్చుగల్​ లాంటి దేశాల్లో ఫుట్​బాల్​ కు అంతే క్రేజ్​ ఉంది. దీంతో అక్కడ జరిగే ఫుట్​ బాల్​ మ్యాచ్ లు కూడా ఎక్కువగా ఉంటాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల ఫుట్​ బాల్​ కు ప్రత్యేకంగా వివిధ స్థాయిల్లో స్టేడియాలు కూడా ఉంటాయి. ఒకటి రెండు కాదు.. వందల సంఖ్యలో స్టేడియాలు ఉంటాయి. అయితే మ్యాచులు జరిగేటప్పుడు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే వారి మధ్య ఏదైనా చిన్న తగాదా తలెత్తితే ఆ వివాదం ఎంత వరకు వెళ్తుంది అనేది ఓ మ్యాచ్​ లో తెలిసొచ్చింది. ఈ మ్యాచ్​ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.

fight in mexican soccer league
fight in mexican soccer league

ఇంతకీ ఏం జరిగింది అంటే ఒకప్పుడు అమెరికాలో భాగంగా ఉండే మెక్సికోలోని ఓ నగరంలో మెక్సికన్​ సాకర్​ లీగ్ పేరుతో ఓ ఫుట్​ బాల్​ మ్యాచ్​ నిర్వహించారు. ఈ మ్యాచ్​ శనివారం జరిగింది. అయితే ఇందులో రెండు జట్లు పాల్గొన్నాయి. అవే క్యూరెటరో, అట్లాస్​ జట్లు. అయితే ఈ మ్యాచ్​ మధ్యలో అభిమానులు ఒక్కసారిగా గుంపులుగా పైకి లేచారు. దీనికి కారణం లేకపోలేదు.

అయితే ఈ రెండు జట్లకు వీరాభిమానులు ఉన్నారు. అయితే జట్ల అభిమానులు మధ్య అనుకోకుండా ఓ చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా చిలిక చిలికి గాలి వానలా మారింది. దీంతో అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది. అయితే ఇదే ఘటనలో కొందరికి గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని నిర్వహకులు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *