ఈ బామ్మ ఇంగ్లీష్ కు మీరు ఫిదా అవ్వాల్సిందే..!

ఇంగ్లీష్ భాష అంటే చాలా ప్రత్యేకం. ఈ భాష వస్తే మనదేశంలోని రాష్ట్రాలే కాదు ప్రపంచాన్నే చుట్టేసి రావొచ్చు. అయితే మాంచి స్టయిలిష్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. పదాలను పలకడం కూడా నిజానికి ఒక టెక్నిక్. ఇప్పుడైతే చిన్నప్పటి నుంచే ఆంగ్లం నేర్పించే పాఠశాలలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే అమ్మ భాషను పక్కనపెట్టి… ఆంగ్ల మీడియంలో విద్యా బోధన చేస్తున్నారు. ఇందుకు సర్కారు మద్దతుగా కూడా ఉంటుంది.

English-Speaking-Grandma-From-Kashmir-Takes-Internet-By-Storm
English-Speaking-Grandma-From-Kashmir-Takes-Internet-By-Storm

మన దేశానికి చెందిన కాస్త వయసు మళ్లిన వాళ్లు ఇంగ్లీషు మాట్లాడితే పెద్ద విశేషమే. విదేశాల్లోని పెద్ద వాళ్లు ఆంగ్లంలో మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అది వారి మాతృభాష. కానీ మన భారతీయ వృద్ధులు ఇంగ్లీషులో మాట్లాడటం చాలా స్పెషాలిటీ. ఓ ముసలవ్వ తనదైన స్టయిల్ లో ఆంగ్లంలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

కశ్మీర్ కు చెందిన ఓ బామ్మ ఇంగ్లీషు మాట్లాడుతోంది. కశ్మీరీ యాసలో చిన్న చిన్న ఇంగ్లిషు పదాలను కూడ పలుక్కుని మాట్లాడుతోంది. అయితే ఈ బామా మాట్లాడేది ఇంగ్లీషును రికార్డు చేసి… సయ్యద్ స్లీత్ షా అనే ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అంతేగాకుండా 30 సెకండ్ల నిడివి గల వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ బామ్మ మాట్లాడే స్టయిలిష్ ఇంగ్లిష్ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వేలమంది వీక్షిస్తూ… షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది వింటే మీరు కూడా ఆమె ఇంగ్లీష్ భాషకు ఫిదా అవ్వాల్సిందే…!

Add a Comment

Your email address will not be published. Required fields are marked *