నదిలో కొట్టుకుపోతున్న జింక… కాపాడిన శునకం..!

ఈ ప్రపంచంలో సాయం చేయడం అనేది చాలా గొప్ప పని. అది వ్యక్తులకు అయినా… లేక జీవులకు అయినా. కానీ మనలో చాలా మంది ఓ వ్యక్తికి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు అని తెలిసినా సరే అటువైపు చూడరు. వారు సాయం చేయమని ఎక్కడ అడుగుతారో అని భయం. అంతేగాకుండా ఎక్కడ వారికి సాయం చేయాల్సి వస్తుందనేది అనుకుంటాం. సాయం విషయంలో మన మనుషులు ఇంతలా ఆలోచిస్తుంటే.. అసలు ఏ బంధం లేని ఓ కుక్క.. నదిలో కొట్టుకుపోతున్న ఓ జింక పిల్లను కాపాడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతుంది.

 

dog saves baby deer

ఇంతకీ ఏం జరిగింది అంటే… ఎవరిదో తెలియని జింక పిల్ల నదిలో కొట్టుకుని పోతున్నది. అయితే దీనిని ఓ పక్కన ఉన్న కుక్క చూసింది. అయితే నాకు ఎందుకు అని కామ్​ గా ఉండలేదు. చూసిన వెంటే రంగంలోకి దిగింది. నీటిలో కొట్టుకుని పోతున్న ఆ జింక పిల్లను నొప్పి తగలకుండా నోటికి కరిపించుకుంది. అలానే నీటిలో ఈత కొట్టుకుంటూ ముందుకు సాగింది. ఒడ్డుకు చేర్చాక.. ఆ జింక పిల్ల మరలా నోరు జారి పోతుంటే.. వెంటనే లాక్కుంది. చివరకు ఆ పిల్లను తన యజమానికి దగ్గరకు తెచ్చి ఇచ్చింది.

అయితే ఆ కుక్క, జింక పిల్లను నోటికి కరిపించుకుని నదిని దాటడం ఆ యజమాని చూశాడు. తన దగ్గర ఉన్న ఫోన్​ లో దానిని బంధించాడు. ఇలా ఆయన తీసిన చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారుతున్నాయి. మరో వైపు కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. శునకం చాలా జాలి కలిగిందని… అందుకే జింక పిల్లను కాపాడినట్లు కామెంట్లు చేస్తున్నారు. కుక్క సాహాసానికి సెల్యూట్​ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద మనుసు ఉన్న వారు మనుషుల్లో ఉండాలని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *