ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన కుక్కు!

ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ఓ శునకం ముప్పు తిప్పలు పెట్టింది. ఆ వైపు నుంచి ఈ వైపుకు… ఈ వైపు నుంచి ఆ వైపుకు పరుగులు పెట్టింది. దానిని పట్టుకునేందుకు ఎయిర్ పోర్టులో ఉన్న సిబ్బంది ఉరుకులు, పరుగు పెట్టారు. ఇలా చాలా సేపు ప్రయత్నించిన తరువాత చివరకు ఆ కుక్క వారి చేతికి చిక్కింది. ఇలా ఆ శునకం సిబ్బందిని పరుగులు పెట్టించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

dog escaping from airplane
dog escaping from airplane

ఈ వీడియోను ఎయిర్ పోర్టులో ఉండే ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో బంధించాడు. అనంతరం దీనిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.  ఈ వీడియోను తాజాగా LADBIBLE అనే ఇస్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేసింది. ఈ వీడియోను సుమారు 2 లక్షల 96 వేల మంది వీక్షించారు. అంతేగాకుండా సుమారు 9 వేల మంది కామెంట్లు చేశారు.

సాధారణంగా జంతువులను ఒక చోట నుంచి మరో చోటుకు విమానాల్లో తరలిస్తుంటారు. ఇలా తరలించేటప్పుడే కొన్ని జంతువులు తప్పించుకోవడం సహజం. ఇది ప్యాకింగ్ వల్ల కూడా జరుగుతుంది. అయితే ఈ కుక్క తప్పించుకోవడం మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారు కూడా ఎక్కువగా కామెంట్లు చేస్తుండడం గమనార్హం. దీనిని చాలా మంది షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టిన కుక్క చివరకు దొరకడం గమనార్హం. లేకపోతే వారి పని అయిపోయేది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *